CM Revanth Reddy distributes one lakh to civil service students(X)

Hyd, January 05:  సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహక చెక్కులను అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం...వెనుకబడిన బిహార్ నుంచే అత్యధికంగా సివిల్స్ లో రాణిస్తున్నారు అన్నారు. అలాంటి ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రంలో కూడా ఉండాలి...అందుకే ఆర్థికంగా సహాయం అందించాలని రాజీవ్ సివిల్స్ అభయహస్తం ద్వారా రూ.లక్ష సాయం అందిస్తున్నాం అన్నారు.

ఇది ఆర్ధిక సాయం కాదు… ప్రభుత్వం వారికి అందిస్తున్న ప్రోత్సాహంగా భావించాలన్నారు. కష్టంతో పాటు కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుంది... ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్ లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నాం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టాం అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లా ప్రగతి భవన్ చుట్టూ పోలీస్ పహారా, ముళ్ల కంచెలు వేశారు అన్నారు. డిసెంబర్ 7 2023 మధ్యాహ్నం ఒంటి గంటకు ముళ్ల కంచెలను బద్ధలు ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చాం అన్నారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణను సాధించుకున్నాం.. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది... సివిల్స్ లో మన రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలనేదే మా ఉద్దేశం అన్నారు.

UPSCలో తెలంగాణ యువత విజయాలు సాధించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రం నుంచి ఇంటర్వ్యూలకు వెళ్లే వారిని చూస్తే గర్వంగా ఉందని...

UPSC పరీక్షలు రాసే యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం అన్నారు. మీ తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా మీరు సెలక్ట్ కావాలని బలంగా కోరుకుంటోందని ఆకాంక్షించారు భట్టి.